Curso disponível

కోవిడ్ -19 పరిచయం: గుర్తించడం, నివారించడం, స్పదించడం, ఇంకా అదుపు లో ఉంచడానికి విధానాలు.

Oferecido por OpenWHO
కోవిడ్ -19 పరిచయం: గుర్తించడం,  నివారించడం, స్పదించడం, ఇంకా అదుపు లో ఉంచడానికి విధానాలు.

కరోనా వైరస్ లు, ఒకపెద్ద వైరస్ ల కుటుంబం. అవి కలుగ చేసే వ్యాధులు, సాధారణ జలుబు మొదలుకొని, అత్యంత తీవ్రమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS), మరియు సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) వరకు విస్తరించి ఉంటాయి.

ఒక సరి క్రొత్త కరోనా వైరస్ (కోవిడ్ - 19) ను, చైనా లోని, ఊహాన్ లో 2019 లో కనుగొన్నారు. ఇది క్రొత్త కరోనా వైరస్. గతం లో దీనిని మనుషులలో ఎప్పుడూ కనుగొనటం జరగ లేదు.

ఈ కోర్స్, కోవిడ్ - 19 గురించి మరియు క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ల గురించి ఒక పరిచయం చేస్తుంది. ఈ కోర్స్, ప్రజారోగ్య సంబంధిత వృత్తి లో వున్న వారిని, ఇన్సిడెంట్ (సంఘటన) నిర్వాహకులను, ఐక్య రాజ్య సమితి కోసం పనిచేస్తున్న వారిని, అంతర్జాతీయ సంస్థలు మరియు ఎన్.జి.ఓ. లను ఉద్దేశించినది.

అఫీషయల్ గా పేరు , ఈ మెటీరియల్ తయారయిన తర్వాత ఇవ్వడం జరిగినది కావున, nCoV అని ఎక్కడ ఉన్నా, అది ఈ మధ్యనే కనుగొన్న కరోనా వైరస్ వలన కలిగే వ్యాధి కోవిడ్ - 19 గానే పరిగణించాలి.

దయచేసి ఈ కోర్సు యొక్క కంటెంట్ ప్రస్తుతం ఇటీవలి మార్గదర్శకాలను ప్రతిబింబించేలా సవరించబడుతుందని గమనించండి. మీరు ఈ క్రింది కోర్సులలో నిర్దిష్ట COVID-19-సంబంధిత అంశాలకు సంబంధించిన అప్‌డేట్ సమాచారాన్ని కనుగొనవచ్చు:

దయచేసి గమనించండి: ఈ పదార్థాలు చివరిగా 16/12/2020న నవీకరించబడ్డాయి.

టీకా: COVID-19 వ్యాక్సిన్‌ల ఛానెల్

IPC చర్యలు: COVID-19 కొరకు IPC

యాంటిజెన్ రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్: 1) SARS-CoV-2 యాంటిజెన్ రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్; 2) SARS-CoV-2 యాంటిజెన్ RDT ఇంప్లిమెంటేషన్ కొరకు ముఖ్య పరిగణనలు

Em modo autodidata
Idioma: తెలుగు
COVID-19

Informações do curso

ఈ కోర్సు ఈ భాషలలో కూడా అందుబాటులో ఉంది:

English - français - Español - 中文 - Português - العربية - русский - Türkçe - српски језик - فارسی - हिन्दी, हिंदी - македонски јазик - Tiếng Việt - Indian sign language - magyar - Bahasa Indonesia - বাংলা - اردو - Kiswahili - አማርኛ - ଓଡିଆ - Hausa - Tetun - Deutsch - Èdè Yorùbá - Asụsụ Igbo - ਪੰਜਾਬੀ - isiZulu - Soomaaliga- Afaan Oromoo - دری - Kurdî - پښتو - मराठी - Fulfulde- සිංහල - Latviešu valoda - Esperanto - ภาษาไทย - chiShona - Kreyòl ayisyen -Казақ тілі - தமிழ் - Ελληνικά

అవలోకనం: ఈ కోర్స్ సరి క్రొత్త కరోనా వైరస్ మరియు ఇతర క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ల గురించి ఒక పరిచయం చేస్తుంది. ఈ కోర్స్ ముగిసే సరికి మీరు ఈ క్రింది వాటిని వివరించగలగాలి:

  • క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ల స్వభావం, ఎక్కడైనా వ్యాధి ప్రబలితే గుర్తించడం మరియు అంచనావేయడం, సరి క్రొత్త స్వాస కోశ వైరస్ లు ప్రబలకుండా నివారించేందుకు మరియు అదుపు చేయడానికి వ్యూహాలు;
  • రిస్క్ (ప్రమాదాన్ని) తెలియపరచడానికి, మానవ సంఘాల ను క్రొత్త స్వాస కోశ వైరస్ ను గుర్తించడం, నివారించడం, స్పదించడం లో భాగస్వాములుగా చేయడానికి అనుసరించవలసిన వ్యూహాలు.

ఈ టాపిక్ లో మరింత లోతుగా తెలుసుకోవడానికి రిసోర్స్ లు జత చేయబడినాయి.

నేర్చుకునే లక్ష్యం: క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ల ప్రాధమిక సూత్రాలను వివరించడం మరియు వ్యాధి ప్రబలితే, ప్రభావవంతముగా ఎలా స్పందించాలి.

కోర్సు వ్యవధి: సుమారు 3 గంటలు.

సర్టిఫికెట్: ఇచ్చిన అన్ని క్విజ్ లలో కనీసం 80% పాయింట్లు సాధించిన అభ్యర్థులందిరికి ‘రికార్డ్ ఆఫ్ ఎచీవ్మెంట్’ సర్టిఫికెట్ అందుబాటులో ఉంటుంది. కార్డ్ ఆఫ్ అచీవ్‌మెంట్ అందుకున్న పాల్గొనేవారు ఈ కోర్సు కోసం ఓపెన్ బ్యాడ్జ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అఫీషయల్ గా పేరు , ఈ మెటీరియల్ తయారయిన తర్వాత ఇవ్వడం జరిగినది కావున, nCoV అని ఎక్కడ ఉన్నా, అది ఈ మధ్యనే కనుగొన్న కరోనా వైరస్ వలన కలిగే వ్యాధి కోవిడ్ - 19 గానే పరిగణించాలి.

తెలుగు లోనికి అనువదించబడింది -మూలం: Introduction to COVID-19: methods for detection, prevention, response and control, 2020. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇందులోని విషయాలకుగాని, అనువాదం లోని ఖచ్చితత్వానికి బాధ్యత వహించదు. ఇంగ్లీష్ మరియు తెలుగు అనువాదం ల మధ్య వ్యత్యాసం కనపడితే, ఇంగ్లీష్ లోనిదే ప్రామాణికమైనది మరియు అనుసరించవలసినది.

Conteúdo do curso

  • మాడ్యూల్ 1: క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ లు, కోవిడ్ -19 తో కలిపి : పరిచయం:

    ఈ మాడ్యూల్ ముగిసే సరికి, స్వాస కోశ వైరస్ లు ఏ విధంగా వస్తాయి అవి ఎందుకు ప్రపంచ వ్యాప్త మానవ ఆరోగ్యానికి ముప్పు ఎందుకో మీరు వివరించ గలగాలి.
  • మాడ్యూల్ 2 : కోవిడ్-19 తో సహా, క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్, లను గుర్తించడం: నిఘా:

    ఈ మాడ్యూల్ పూర్తి అయ్యే సరికి మీరు క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ప్రబలటాన్ని గుర్తించడం మరియు అంచనా వేయడం చేయ గలగాలి.
  • మాడ్యూల్ 3 : క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ లు, కోవిడ్-19 లను గుర్తించడం: ల్యాబరేటరీలో పరీక్షలు:

    ఈ మాడ్యూల్ పూర్తి అయ్యే సరికి మీరు కోవిడ్-19 ని నిర్ధారించడానికి అవసరమయిన వివిధరకాల శ్యాంపిల్ లను, ల్యాబరేటరీలో పరీక్షలను వివరించగలగాలి.
  • మాడ్యూల్ 4: రిస్క్ గురించి చెప్పడం:

    ఈ మాడ్యూల్ పూర్తి అయ్యే సరికి మీరు క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ల రిస్క్ గురించి చెప్పడం లో కీలకమైన విషయాలను వివరించడం , ప్రభావపూర్వకమయిన ఆరోగ్య సలహా లను అందించడం లో ముఖ్యమయిన ఆటంకాల లలో కనీసం మూడు చెప్పటం, ఇంకా వ్యాధి ప్రబలినపుడు, రిస్క్ గురించి చెప్పడం అనే ప్రక్రియ పనిచేయడానికి కొన్ని కీలకమైన జోక్యం చేసుకొనే అంశాలను గుర్తించడం.
  • మాడ్యూల్ 5 : సమాజానికి పాత్ర కల్పించడం:

    ఈ మాడ్యూల్ పూర్తి అయ్యే సరికి మీరు, వ్యాధి ప్రబలినపుడు, దానికి ప్రతిస్పందించేవాళ్ళు ఎందుకు సమాజానికి పాత్ర కల్పించాలో కనీసం మూడు కారణాలు వివరించ గలగాలి. సమాజానికి పాత్ర కల్పించడం లో ఎదురు అయ్యే సమస్యల జాబితా తయారు చేయడం.వ్యాధి ప్రబలినపుడు గుర్తించడం, నివారించడం, తగిన విధంగా స్పందించడం లో సమాజానికి ప్రభావ పూర్వక పాత్ర కల్పించడానికి తగిన మార్గాలను వివరించ గలగాలి.
  • మాడ్యూల్ 6 : క్రొత్తగా వచ్చే స్వాస కోశ వైరస్ (కోవిడ్-19 తో సహా) ల నివారణ, మరియు ప్రతిస్పందన:

    ఈ మాడ్యూల్ పూర్తి అయ్యే సరికి మీరు, సమాజం మరియు ఆరోగ్య సంస్థలలో వ్యాధి నివారణ సూత్రాలను వివరించ గలగాలి.

Inscrever-me neste curso

O curso é gratuito. Basta se registrar para uma conta em OpenWHO e fazer o curso!
Inscrever-me agora

Requisitos de certificado

  • Ganhe um registro de conquista ao ganhar mais de 80% do número máximo de pontos de todas as tarefas com nota.
  • Ganhe um Open Badge ao concluir o curso.