课程进行中
కరోనా వైరస్ లు, ఒకపెద్ద వైరస్ ల కుటుంబం. అవి కలుగ చేసే వ్యాధులు, సాధారణ జలుబు మొదలుకొని, అత్యంత తీవ్రమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS), మరియు సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) వరకు విస్తరించి ఉంటాయి.
ఒక సరి క్రొత్త కరోనా వైరస్ (కోవిడ్ - 19) ను, చైనా లోని, ఊహాన్ లో 2019 లో కనుగొన్నారు. ఇది క్రొత్త కరోనా వైరస్. గతం లో దీనిని మనుషులలో ఎప్పుడూ కనుగొనటం జరగ లేదు.
ఈ కోర్స్, కోవిడ్ - 19 గురించి మరియు క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ల గురించి ఒక పరిచయం చేస్తుంది. ఈ కోర్స్, ప్రజారోగ్య సంబంధిత వృత్తి లో వున్న వారిని, ఇన్సిడెంట్ (సంఘటన) నిర్వాహకులను, ఐక్య రాజ్య సమితి కోసం పనిచేస్తున్న వారిని, అంతర్జాతీయ సంస్థలు మరియు ఎన్.జి.ఓ. లను ఉద్దేశించినది.
అఫీషయల్ గా పేరు , ఈ మెటీరియల్ తయారయిన తర్వాత ఇవ్వడం జరిగినది కావున, nCoV అని ఎక్కడ ఉన్నా, అది ఈ మధ్యనే కనుగొన్న కరోనా వైరస్ వలన కలిగే వ్యాధి కోవిడ్ - 19 గానే పరిగణించాలి.
దయచేసి ఈ కోర్సు యొక్క కంటెంట్ ప్రస్తుతం ఇటీవలి మార్గదర్శకాలను ప్రతిబింబించేలా సవరించబడుతుందని గమనించండి. మీరు ఈ క్రింది కోర్సులలో నిర్దిష్ట COVID-19-సంబంధిత అంశాలకు సంబంధించిన అప్‌డేట్ సమాచారాన్ని కనుగొనవచ్చు:
దయచేసి గమనించండి: ఈ పదార్థాలు చివరిగా 16/12/2020న నవీకరించబడ్డాయి.
టీకా: COVID-19 వ్యాక్సిన్‌ల ఛానెల్
IPC చర్యలు: COVID-19 కొరకు IPC
యాంటిజెన్ రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్: 1) SARS-CoV-2 యాంటిజెన్ రాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టింగ్; 2) SARS-CoV-2 యాంటిజెన్ RDT ఇంప్లిమెంటేషన్ కొరకు ముఖ్య పరిగణనలు
ఈ కోర్సు ఈ భాషలలో కూడా అందుబాటులో ఉంది:
English - français - Español - 中文 - Português - العربية - русский - Türkçe - српски језик - فارسی - हिन्दी, हिंदी - македонски јазик - Tiếng Việt - Indian sign language - magyar - Bahasa Indonesia - বাংলা - اردو - Kiswahili - አማርኛ - ଓଡିଆ - Hausa - Tetun - Deutsch - Èdè Yorùbá - Asụsụ Igbo - ਪੰਜਾਬੀ - isiZulu - Soomaaliga- Afaan Oromoo - دری - Kurdî - پښتو - मराठी - Fulfulde- සිංහල - Latviešu valoda - Esperanto - ภาษาไทย - chiShona - Kreyòl ayisyen -Казақ тілі - தமிழ் - Ελληνικά
అవలోకనం: ఈ కోర్స్ సరి క్రొత్త కరోనా వైరస్ మరియు ఇతర క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ల గురించి ఒక పరిచయం చేస్తుంది. ఈ కోర్స్ ముగిసే సరికి మీరు ఈ క్రింది వాటిని వివరించగలగాలి:
ఈ టాపిక్ లో మరింత లోతుగా తెలుసుకోవడానికి రిసోర్స్ లు జత చేయబడినాయి.
నేర్చుకునే లక్ష్యం: క్రొత్తగా వస్తున్న స్వాస కోశ వైరస్ ల ప్రాధమిక సూత్రాలను వివరించడం మరియు వ్యాధి ప్రబలితే, ప్రభావవంతముగా ఎలా స్పందించాలి.
కోర్సు వ్యవధి: సుమారు 3 గంటలు.
సర్టిఫికెట్: ఇచ్చిన అన్ని క్విజ్ లలో కనీసం 80% పాయింట్లు సాధించిన అభ్యర్థులందిరికి ‘రికార్డ్ ఆఫ్ ఎచీవ్మెంట్’ సర్టిఫికెట్ అందుబాటులో ఉంటుంది. కార్డ్ ఆఫ్ అచీవ్‌మెంట్ అందుకున్న పాల్గొనేవారు ఈ కోర్సు కోసం ఓపెన్ బ్యాడ్జ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అఫీషయల్ గా పేరు , ఈ మెటీరియల్ తయారయిన తర్వాత ఇవ్వడం జరిగినది కావున, nCoV అని ఎక్కడ ఉన్నా, అది ఈ మధ్యనే కనుగొన్న కరోనా వైరస్ వలన కలిగే వ్యాధి కోవిడ్ - 19 గానే పరిగణించాలి.
తెలుగు లోనికి అనువదించబడింది -మూలం: Introduction to COVID-19: methods for detection, prevention, response and control, 2020. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇందులోని విషయాలకుగాని, అనువాదం లోని ఖచ్చితత్వానికి బాధ్యత వహించదు. ఇంగ్లీష్ మరియు తెలుగు అనువాదం ల మధ్య వ్యత్యాసం కనపడితే, ఇంగ్లీష్ లోనిదే ప్రామాణికమైనది మరియు అనుసరించవలసినది.